కరోనా వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వాహన రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. కరోనా వచ్చిన కొత్తల్లో లాక్ డౌన్ వల్ల వాహన అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత కేసులు తగ్గడం, ప్రయాణాలు పెరగడం, ప్రజా రవాణాకు పెద్దగా ఎవరూ ఇష్టపడకపోవడం.. వాహన రంగానికి మేలు చేసింది. దీంతో అమాంతం విక్రయాలు పెరిగాయి. సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయాల్లో కూడా భారీగా పెరుగుదల నమోదైంది. సొంత వాహనం ఉండాలనేవారి సంఖ్య పెరగడంతో వాహన విక్రయాలు రాను రాను భారీగా పెరిగాయి.