భూమి ఉష్ణోగ్రత మరో రెండు డిగ్రీలు పెరిగితే.. భూమి వినాశనానికి దారి తీస్తుందట. ఐక్యరాజ్య సమితి 195 దేశాల ప్రభుత్వాల సహకారంతో వందల మంది శాస్త్రవేత్తలు పరిశోధనలతో రూపొందించిన వాతావరణ మార్పు 2021 నివేదిక చెబుతున్న వాస్తవం ఇది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అదుపులో ఉండాలంటే.. దేశాధినేతలు నడుం బిగించాల్సిందేనంటోంది ఈ నివేదక.