కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ డేటా సహా పోస్ట్-వ్యాక్సినేషన్ సమాచారాన్ని బహిరంగపరచాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం టీకా ట్రయల్స్ డేటాను ప్రభుత్వం తప్పక పబ్లిష్ చేయాల్సి ఉంటుందంటూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్పై స్పందన కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.