ఇప్పటి వరకూ ఆన్ లైన్ బోధనతో సరిపెట్టిన ప్రభుత్వాలు.. చిన్నారుల స్కూల్స్ విషయంలో ఇప్పుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఆగస్ట్ 16 తర్వాత స్కూల్స్ పునఃప్రారంభం కాబోతున్నాయి. తమిళనాడు లాంటి రాష్ట్రాలు సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ చేశాయి. ఇక పంజాబ్ లో మాత్రం ఇటీవలే స్కూల్స్ తిరిగి తెరుచుకున్నాయి. అయితే అక్కడ స్కూల్ విద్యార్థులకు కరోనా సోకడం మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది.