రైతులకు ఆర్థిక సాయం విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా ఉంటుందని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే రైతు బంధు పేరుతో ఆర్థిక సాయం అందుతున్నా అది కేవలం భూస్వాములకు, పెద్ద రైతులకు ఉపయోగపడుతుందనే విమర్శలున్నాయి. ఇన్ కమ్ ట్యాక్స్ కట్టే వారు కూడా రైతు బంధు అందుకున్నారని ఆమధ్య ఈటల రాజేందర్ కూడా విమర్శించారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. చిన్న, సన్నకారు రైతులను కూడా దగ్గరకు తీయబోతోంది. ఆ దిశగా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.