కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ వార్తలతో చాలామంది టీఆర్ఎస్ నేతలు నొచ్చుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారిని కాదని, కాంగ్రెస్ నుంచి పార్టీలోకొచ్చిన రోజుల వ్యవధిలోనే ఆయనకు పట్టం కట్టాలనుకోవడం చాలామందికి రుచించలేదు. దీంతో కేసీఆర్ కి నేరుగానే తమ అభ్యంతరాలను తెలిపారట. అలా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ సీటు కాస్తా కేవలం హామీగానే మిగిలిపోయిందని అంటున్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపుకోసం కౌశిక్ రెడ్డి కష్టపడితే, ఆ కష్టానికి విజయం రూపంలో ఫలితం దక్కితే, అప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఖాయం చేస్తారట. మొత్తమ్మీద ఖాయం అనుకున్న ఎమ్మెల్సీ పోస్ట్ ఇలా హుజూరాబాద్ గెలుపుతో ముడిపడిపోయింది.