ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో జరిగిన జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగం విఫలమైంది. రాకెట్ ప్రయోగం నింగిలోకి బాగానే ఎగసినా.. క్రయోజనిక్ దశలో రాకెట్లో సమస్య తలెత్తింది. ఈ లోపం కారణంగా వాహకనౌక ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో ప్రయాణించింది.