జగన్ పాలన పై ప్రజల్లో ఆందోళన పెరిగిందంటూ జనసేన పార్టీ తరపున ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో వైసీపీ ప్రభుత్వం పై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డి గారి నాయకత్వం పై ప్రజల్లో ఆందోళన పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం చేపట్టినా గొంతు నొక్కే ప్రయత్నాలు చేయడం తప్ప సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించాలి అనే జ్ఞానం కరువైందని ఆరోపించారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు పై బెంగతో ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆరోపించారు. యువతకు అండగా జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పోలీసులు ఇబ్బంది పెట్టాలని చూసిన విషయాన్ని గుర్తు చేశారు.