ఏపీలో కాపు సామాజికవర్గం బలం ఎంత అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో కులాల వారీగా చూస్తే కాపు ఓటర్లే ఎక్కువ ఉంటారు. వీరు చాలా నియోజకవర్గాల్లో పార్టీల గెలుపోటములని డిసైడ్ చేస్తారు. అందుకే రాజకీయ పార్టీలు ఎక్కువగా కాపులని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటాయి. అలాగే ప్రభుత్వాలు కూడా కాపులపై వరాలు కురిపిస్తాయి. కానీ వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయని ప్రభుత్వాలని గద్దె దింపడంలో కాపులు ముందే ఉంటారు.