ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, టీడీపీ-జనసేన పొత్తుపై ఆసక్తికర విశ్లేషణలు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే, 2014 ఫలితాలు రిపీట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల, ఈ రెండు పార్టీలకు డ్యామేజ్ జరిగింది. పైగా ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌లు కలిసి పోటీ చేయకపోతే, మళ్ళీ వైసీపీకే అడ్వాంటేజ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.