జగన్ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారా? ఎప్పుడు తమని మంత్రివర్గంలోకి తీసుకుంటారా? అని వైసీపీలో పలువురు ఆశావాహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జగన్ మొదట్లో రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పు చేస్తానని చెప్పగా, ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటిన నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో మంత్రివర్గంలో మార్పులపై ఆసక్తికర విశ్లేషణలు వస్తున్నాయి. ఎవరు మంత్రివర్గం నుంచి బయటకు వస్తారు? ఎవరు మంత్రివర్గంలోకి వెళ్తారు? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.