దళితబంధు పథకానికి వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారట. దానికి చైర్మన్గా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును నామినేట్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారట. మోత్కుపల్లి నర్సింహులు ఇప్పటికే అధికారికంగా టీఆర్ఎస్లో చేరలేదు. అయినా సరే.. ఆయన్ను త్వరలోనే పార్టీలో చేర్చుకుని దళిత బంధు ఛైర్మన్ పదవి ఇస్తారని చెబుతున్నారు.