ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే స్కూల్స్ తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వై.ఉమాశంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ వివరణ అడిగింది. ఈ వివరాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుని కేసుని ఈనెల 18కి వాయిదా వేసింది. స్కూల్స్ పునఃప్రారంభం ఈనెల 16నుంచి కావడంతో.. హైకోర్టులో కూడా స్కూల్స్ రీఓపెన్ కి గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది.