ఏపీలో జనసేన పార్టీ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక, ఏపీలో ఆ పార్టీ ఏ మాత్రం పుంజుకోలేకపోయింది. ఇక వచ్చే ఎన్నికల నాటికి కూడా జనసేన పుంజుకునే పరిస్తితి కనిపించడం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళుతున్నా సరే జనసేనకు ఏ మాత్రం కలిసిరాలేదని స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి.