తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు గానీ, అక్కడ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగడం మాత్రం ఎప్పటినుంచో మొదలైపోయింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్...టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన దగ్గర నుంచి, హుజూరాబాద్‌లో రాజకీయ వేడి మొదలైంది. ఈటలని ఎలాగైనా ఓడించాలని అధికార టీఆర్ఎస్ దూకుడుగా రాజకీయాలు చేస్తుంది. ఇటు ఈటల సైతం, తన బలం ఏంటో టీఆర్ఎస్కు చూపించాలని అనుకుంటున్నారు.