కర్నూలు జిల్లా...ఈ జిల్లా పేరు చెబితే చాలు...వైసీపీకి కంచుకోట అని అర్ధమైపోతుంది. రాష్ట్రంలో రాజకీయం ఎలాగైనా ఉన్నా సరే, కర్నూలులో మాత్రం రాజకీయం వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది. అందుకే 2014 ఎన్నికల్లో సైతం జిల్లాలో ఎక్కువ సీట్లు వైసీపీ గెలుచుకుంది. మొత్తం 14 సీట్లలో వైసీపీ 11 గెలుచుకుంటే, టీడీపీకి మూడే దక్కాయి. 2019 ఎన్నికలైతే చెప్పాల్సిన పని లేదు...మొత్తం వైసీపీనే క్లీన్‌స్వీప్ చేసేసింది.