విడదల రజిని, ఉండవల్లి శ్రీదేవి....జగన్ గాలిలో ఊహించని విధంగా విజయం సాధించిన ఎమ్మెల్యేలు. అసలు గెలుపు సాధ్యం కాదన్న చోట ఈ ఇద్దరు మహిళా నాయకులు గెలిచి చూపించారు. చిలకలూరిపేటలో రజిని, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుకు చెక్ పెట్టి మరీ వైసీపీ జెండా ఎగరవేశారు. ఇటు రాజధాని అమరావతిలో కీలకంగా ఉన్న తాడికొండలో అసలు వైసీపీ గెలుపు సాధ్యమే కాదని అంతా అనుకున్నారు.