రాజకీయాల్లో ఏ నాయకుడుకైన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలని పరిష్కరించడమే సక్సెస్ ఫార్ములా అని చెప్పొచ్చు. ఎప్పుడైతే నాయకులు ప్రజలకు దూరమవుతారో, అప్పుడు వారు గెలుపుకు కూడా దూరమవుతారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండాలి. అప్పుడే వారిని ప్రజలు ఆదరిస్తారు. అయితే అలా ప్రజలకు దగ్గరగా ఉండాలంటే పాదయాత్ర మంచి సక్సెస్ ఫార్ములా. ఆ ఫార్ములాతోనే గతంలో వైఎస్సార్, చంద్రబాబు, జగన్లు సక్సెస్ అయ్యారు.