కేరళను కరోనా మహమ్మారి పట్టి వేధిస్తోంది. అక్కడ రోజూ 20వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా కొత్తగా 20,452 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటివరకూ కేరళలో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 62వేలు దాటాయి. కేరళలో మరణాల సంఖ్య 18వేలు దాటింది. ఇంకా అక్కడ లక్షా 80వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.