కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా వైరస్ బారిన పడకుండా తప్పించుకోలేరు. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్, శానిటైజర్ వాడాల్సిందే, సామాజిక దూరం పాటించాల్సిందే. ఇప్పటి వరకూ అందరూ ఇదే చెబుతున్నారు. మరి వ్యాక్సిన్ వేయించుకోవడం దేనికి అంటే, కరోనా వచ్చినా దాని ప్రభావం ఎక్కువగా లేకుండా చూసుకోడానికి.. అనే సమాధానం వినిపిస్తోంది. భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్, టీకా తర్వాత కొవిడ్ ఎంతమందికి సోకింది అనే విషయాలపై ఆసక్తికర అధ్యయనం జరిగింది. ఈ అధ్యయన ఫలితాలను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.