తమ వ్యాపార అభివృద్ధికోసం కంపెనీలు వివిధ రకాల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటాయి. ఇలాంటి ప్రచారాల్లో అతిశయోక్తులే మరీ ఎక్కువ. అయితే కొన్ని సందర్భాల్లో అశ్లీలత, అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగులకు మాత్రం సెన్సార్ ఉంటుంది. కానీ కొన్ని అడ్వర్టైజ్మెమెంట్లు చూడటానికి అందంగానే ఉన్నా.. వాటి ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలుంటాయి. తాజాగా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు.