ప్రజాక్షేత్రం నుంచి గెలవకుండా ఎమ్మెల్సీ అయ్యి, మంత్రిగా పనిచేసిన నారా లోకేష్‌ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు ఏ స్థాయిలో ఆడుకున్నారో చెప్పాల్సిన పని లేదు. లోకేష్ మాట్లాడితే చాలు వైసీపీ నేతలు తెగ ట్రోల్ చేసేవారు. ఎందుకంటే లోకేష్‌కు సరిగ్గా తెలుగు మాట్లాడటం రాదు కాబట్టి. ఆయన తెలుగు మాట్లాడితే చాలు అనేక తప్పులు వచ్చేవి. వాటిని పట్టుకుని వైసీపీ నేతలు, లోకేష్‌ని పప్పు, పప్పు అంటూ ఓ రేంజ్లో ఎగతాళి చేస్తూ వచ్చారు.