రాజకీయాల్లో నేతల మధ్య ఉండే లుకలుకలు ప్రత్యర్ధులకు బాగా ప్లస్ అవుతాయి. ఆ లుకలుకలని సెట్ చేసుకోకపోతే పార్టీలు నష్టపోతాయి. అలా నేతల వల్ల భీమిలి నియోజకవర్గంలో టీడీపీ నష్టపోయేలా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీలో ఉండే లుకలుకలు మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కలిసొచ్చేలా ఉన్నాయి. మామూలుగా భీమిలి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీ జెండా ఎగిరింది.