కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద కృష్ణా నది వరదలో 130 వరకూ లారీలు చిక్కుకుపోయాయి. ఇవన్నీ ఇసుక తరలించేలా లారీలు.. ఇసుక కోసం నదిలోకి వచ్చాయి. ఒక్కసారిగా వరద పోటెత్తింది. లారీలు వెళ్లే మార్గం కొట్టుకుపోయింది. నదిలోకి వెళ్లడం కుదిరింది కానీ.. బయటకు వచ్చే దారి కనిపించడం లేదు.