తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మహిళలకోసం ప్రవేశ పెట్టిన పథకాలు, నిరుపేదలకు ఆర్థిక సాయం వంటివే కాకుండా.. ఇటీవల పెట్రోలు రేట్లను కూడా తగ్గించి దేశంలోనే అలాంటి నిర్ణయం తీసుకున్న తొలి సీఎంగా మారారు. తాజాగా.. కులం గోడల్ని కూల్చే పని మొదలు పెట్టారు స్టాలిన్. తండ్రి కరుణానిధి కల ఇది అంటూ స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్-15నుంచి దాన్ని అమలులో పెట్టారు.