కేంద్రం అయినా, రాష్ట్రాలయినా ఉచిత పథకాలకోసం ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మేస్తున్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీల్ని ప్రైవేటు పరం చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల్ని లాభాలబాటలో నడపలేనని ప్రభుత్వాలెందుకు. ఆ తప్పుల్ని ఆయా సంస్థలపై నెట్టేసి, వాటిని వదిలించుకోవడం దేనికి? ఆస్తుల్ని కాపాడలేని ప్రభుత్వాలు వాటిని తెగనమ్మడం దేనికి సంకేతం. అసలు ఎవరిసొమ్ము ఎవరు దానం చేస్తున్నారు. ఎవరి సంపదను ఎవరు హారతి కర్పూరం చేస్తున్నారు. పంచి పెట్టడం తప్పు అనడంలేదు, అదే సమయంలో దానికి కావాల్సిన సంపదను సృష్టించడం మానేయడమే పెద్ద తప్పు.