75ఏళ్ల స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్నా ఇంకా జాబ్ క్యాలెండర్లకోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది. ఉద్యోగమే జీవిత పరమావధి అనుకుంటే.. ఐఐటీ టాప్ ర్యాంకర్లు ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎందుకు వేచి చూడరు. తాము ఎంచుకున్న రంగంలో సత్తా చూపించడానికి ఎందుకు ఉత్సాహపడుతుంటారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వ్యాపారాన్నే ఎందుకు ఉపాధి మార్గంగా ఎంచుకుంటారు. కష్టపడిపే ప్రతిఫలం ఉంటుంది. కేవలం ఉద్యోగంలోనే కాదు, ఉపాధి మార్గం ఏదయినా కష్టపడితేనే సరైన ప్రతిఫలం ఉంటుంది.