దేశమంతా స్వాతంత్ర సంబరాలు ఘనంగా జరిగాయి. అందరిలో దేశభక్తి ఉప్పొంగి వాట్సప్ మెసేజ్ లు, స్టేటస్ ల రూపంలో పెల్లుబికింది. కానీ ఆ ఉత్సాహం కేవలం మాటలకే పరిమితం, చేతల్లో కాదు అనేది గుంటూరులో రుజువైంది. పట్టపగలు, నడిరోడ్డులో గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైంది. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను గమనిస్తే అందరూ ఆ హత్యను చూసేవారే కానీ, వారించేవారే లేరని స్పష్టమైంది. ప్రజల్లో ఆ మాత్రం సామాజిక స్పృహ లేదు సరే, మరి ప్రభుత్వం ఏం చేస్తోంది.