తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కొత్త కవర్ లో తెచ్చుకున్నవారంతా ఇకపై ఇంటికి తులసి మొక్కను కూడా తెచ్చుకున్నట్టే. ఆ కవర్ ని మట్టిలో వేసి నీరు పోస్తే.. తులసి మొక్కలు వస్తాయని చెబుతున్నారు అధికారులు. అంటే శ్రీవారి ప్రసాదంతో పాటు, వృక్ష ప్రసాదం కూడా అందుకున్నట్టే లెక్క. క్లాస్ బ్యాగ్స్, సీడ్ ఎంబడెడ్ కవర్లు కొండపై అందుబాటులోకి వచ్చాయి.