కేరళలో కేసులు పెరుగుతుండటంతో పొరుగు రాష్ట్రాలు భయపడుతున్నాయి. అటు తమిళనాడు, ఇటు కర్నాటక రాష్ట్రాలు కూడా సరిహద్దుల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి. కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గలేదా, లేక థర్డ్ వేవ్ మొదలైందా అనే విషయాల్ని పక్కనపెడితే కేరళలో మాత్రం కొవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోందని అర్థమవుతోంది. ఈ దశలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా, లేక కేరళ ప్రభుత్వమే కట్టడి చర్యలు తీసుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.