శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం....తెలుగుదేశం పార్టీకి కంచుకోట..ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఆవిర్భవించాక ఇక్కడ మరో పార్టీ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. కేవలం 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలవగా, ఎక్కువసార్లు పసుపు జెండా ఎగిరింది. ఇక పదేళ్ళ క్రితం వచ్చిన వైసీపీకి ఇక్కడ ఇంతవరకు విజయం దక్కలేదు. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ వరుసగా ఓడిపోయింది. రెండుసార్లు టీడీపీ తరుపున అచ్చెన్నాయుడు విజయం సాధిస్తూ వస్తున్నారు.