రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సీఎం పేర్లని పెట్టడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాలకు సీఎం పేర్లు లేదా వారి కుటుంబ సభ్యుల పేర్లని పెట్టడాన్ని పవన్ ఖండిస్తున్నారు. అసలు ప్రజల సొమ్ముతో అమలు చేసే పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వారి ఏమి దేశం కోసం పోరాటం చేయలేదని, కేవలం ఆయా పార్టీల బాగు కోసం పనిచేశారని అంటున్నారు. దేశం పోరాటం చేసిన మహనీయుల పేర్లు వదిలేసి, కేవలం సీఎంల పేర్లు పెట్టడాన్ని పవన్ తప్పుబడుతున్నారు.