నాలుగు దశాబ్దాల చరిత్రగల తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు కలకలం సృష్టిస్తుంది. అటు తెలంగాణలో పార్టీ దాదాపు కనుమరుగయ్యే స్థితిలో ఉండటం...ఇటు ఏపీలో అధికారం కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉండటంతో జూనియర్ పార్టీలోకి వచ్చి, పార్టీని నడిపించాలనే డిమాండ్ పెరిగిపోయింది. చంద్రబాబుకు వయసు మీద పడటంతో, ఆయనకు పార్టీని నడిపించే ఓపిక లేదని, ఇటు నారా లోకేష్‌కు ప్రజల్లో క్రేజ్ లేదని, అలాగే పార్టీ నడిపించే సామర్ధ్యం లేదని, అందుకనే జూనియర్ రావాలని కొందరు తెలుగు తమ్ముళ్ళ నుంచి డిమాండ్ వస్తున్న విషయం తెలిసిందే.