ఇండియా టుడే మోస్ట్ పాపులర్ సీఎం అంటూ ఓ లిస్టు విడుదల చేసింది. ఏ రాష్ట్రం వాళ్లను ఆ రాష్ట్ర సీఎం గురించి ప్రశ్నించారు. ఈసారి తమిళనాడు సీఎం స్టాలిన్ అందరికన్నా ఎక్కువ ప్రజాదరణతో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. ఈ ఏడాదే సీఎం అయిన స్టాలిన్.. తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు అందుకున్నారని చెప్పాలి. 48 శాతం ప్రజాదరణతో ఆయన నెంబర్ వన్ స్థానం దక్కించుకున్నారు.