జగనన్న విద్యాకానుక అమలు కోసం అధికారులతో కలిసి సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర కొటియా గ్రామాలకు వెళ్లారు. అక్కడ ఒడిశాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆయన్ను అడ్డుకున్నారు. కొటియా గ్రామాల్లోకి వెళ్లనిచ్చేది లేదన్నారు. జగనన్న విద్యాకానుక పంపిణీకి వెళ్లిన అధికారుల నుంచి పుస్తకాలు లాగేసుకున్నారు. చివరకు ఎమ్మెల్యేను కూడా అడుగు ముందుకు కదలనివ్వలేదు.