తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఈనెల 24నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం నలుగురు సభ్యుల బృందాన్ని తెలంగాణకు పంపించింది. రెండ్రోజలు క్రితమే వీరు హైదరాబాద్ చేరుకున్నారు. బండి సంజయ్ సహా ఇతర కీలక నేతలందరితో సమావేశమయ్యారు. కేంద్ర బృందం కాబట్టి.. నాయకులందరినీ విడివిడిగా కలిసి వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.