తెలంగాణ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం ఏదైనా ఉందంటే అది హుజురాబాద్ ఉప ఎన్నికలు గురించే. ఊహించని విధంగా టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ హుజూరాబాద్ బరిలో నిలబడిన విషయం తెలిసిందే. ఎలాగైనా తన సొంత బలంతో హుజురాబాద్ లో గెలిచి కేసీఆర్కు తన సత్తా ఏంటో చూపించాలని ఈటల చూస్తున్నారు.