ప్రస్తుతం భారత్ లో రెండు డోసుల వ్యాక్సినేషన్ కార్యక్రమమే నింపాదిగా సాగుతోంది. 50కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ పూర్తి చేశారనంటున్నా.. డబుల్ డోస్ తీసుకున్నవారి సంఖ్య అందులో సగానికి కాస్త ఎక్కువ మాత్రమే. మిగతా వారంతా సింగిల్ డోస్ తీసుకున్నవారే. ఇలాంటి దశలో భారత్ లో బూస్టర్ డోస్ అంటే అది మరింత ఆలస్యం అవడం ఖాయం. ఓవైపు సింగిల్ డోస్ అందనివారికి ప్రయారిటీ ఇవ్వకుండా కొత్తగా కొంతమందిని ఎంపిక చేసి బూస్టర్ డోస్ ఇస్తే అది మరిన్ని వివాదాలకు దారి తీస్తుంది. అందుకే అసలు ఈ బూస్టర్ డోస్ వ్యవహారాన్ని భారత్ లో పూర్తిగా పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.