రాజకీయాల ఒకేలా ఉండవని టిడిపి నేత నారా లోకేష్‌ని చూస్తే అందరికీ అర్థమవుతుందని చెప్పొచ్చు. నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్లు... ఎవరైతే గతంలో నారా లోకేష్‌ని పప్పు అని ఎగతాళి చేశారో, ఇప్పుడు వారే లోకేష్ లీడర్‌గా ఎదుగుతున్నాడని కాస్త కంగారు పడుతున్నట్లు కనిపిస్తోంది. టిడిపి అధికారంలో ఉండగా, లోకేష్‌పై వైసీపీ నేతలు ఏ రేంజ్లో సెటైర్లు వేసేవారో అందరికీ తెలిసిందే. ఆయన మాటతీరుపై, బాడీ తీరుపై ఎగతాళి చేస్తూ వచ్చారు.