హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణకు అదిరిపోయే షాక్ తగలనుందా? హిందూపురంలో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయిందా? వైసిపికి అనుకూలంగా నియోజకవర్గంలో రాజకీయం జరుగుతుందా? అంటే వైసీపీ నేతలు మాటలు బట్టి చూస్తే ఇక్కడ బాలయ్య సీన్ అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ బాలయ్య గెలవడం కష్టమని వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. ఇక్కడ బలంగా ఉన్న టిడిపి క్యాడర్ని వైసిపి నేత ఇక్బాల్ వరుస పెట్టి తమ పార్టీలో చేర్చుకుంటూ, హిందూపురంలో దూసుకెళ్తున్నారు.