ఆఫ్గనిస్థాన్ ప్రభుత్వం పతనం తరవాత దేశం పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. దాంతో తాలిబన్లు తమ రాక్షత్వాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. వారి భయానికి రోడ్లపైకి రావాలంటేనే మహిళలు వనికిపోతున్నారు. మరోవైపు కాబోల్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పౌరులను దేశం విడిచి వెళ్లిపోకుండా ఆంక్షలు విధిస్తున్నారు. తాలిబన్ల తమ మాటల్లో మహిళలకు కొంత స్వేచ్చను ఇచ్చామని చెబుతున్నా ప్రజలు నమ్మే పరిస్థితిలేదు. మరోవైపు తాజాగా ఆఫ్గనిస్తాన్ మహిళా ఫుట్ బాల్ ప్లేయర్ విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు అక్కడ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. తమను తాలిబన్ల నుండి రక్షించాలంటూ మహిళా ఫుట్ బాల్ జట్టు కెప్టెన్, గర్ల్ పవర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు మరియు డైరెక్టర్ అయిన ఖలిదా పోపాల్ కోరుతోంది.