గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ఆరోపణలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో వైసీపీకి భారీ మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో దివంగత కోడెల శివప్రసాద్ వారసుడు శివరాం టీడీపీలో ఫుల్ యాక్టివ్గా ఉంటే, ఆ పార్టీకే ప్లస్ అవుతుందని అంటున్నారు.