ప్రస్తుతం ఆర్ ఫ్యాక్టర్ క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అందుకే మూడో ముప్పు తప్పినట్టేనని భావిస్తున్నారు. ఆర్-ఫ్యాక్టర్ క్షీణించడం వల్ల ఇక మూడో ముప్పు ఉండే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషిస్తున్నారు. ఆర్-ఫ్యాక్టర్ ఆధారంగా కరోనా వైరస్ వ్యాప్తిని మొదటి నుంచి చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ విశ్లేషిస్తోంది.