కృష్ణానదీ జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో తెలంగాణ విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తోందని.. దాన్ని ఆపాలని కృష్ణా బోర్టుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి ఏపీ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ లేఖ రాశారు.