అఖిల భారత కాంగ్రెస్ కే.. అధ్యక్షుడు లేడు, ఇక ఏపీ అధ్యక్షుడి గురించి ఆలోచించేవారు ఉంటారా అని చాన్నాళ్లుగా అనుకుంటున్నారు. కానీ ఇటీవల ఏపీలో పార్టీ వ్యవహారంపై ఢిల్లీలో సీరియస్ గా చర్చ జరిగిందట. కొంతమంది సీనియర్లు సైతం హస్తిన వెళ్లి చర్చల్లో మునిగితేలారు. ఈ దశలో పీసీసీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించి, పార్టీ పదవుల విషయంలో కూడా స్పష్టత వస్తుందని అనుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఏపీ పీసీసీ పదవిని కూడా రేవంత్ రెడ్డికి అప్పగించి, రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే పీసీసీ ప్రకటిస్తారనే ప్రచారం కూడా మొదలైంది.