తెలంగాణలో సెకండ్ వేవ్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయినట్టే కనపడుతోంది. రోజువారీ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. మరోవైపు డిశ్చార్జిలు కూడా పెరిగి, యాక్టివ్ కేసుల సంఖ్య కనిష్టానికి పడిపోయింది. అయినా కూడా అప్రమత్తత అవసరం. మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయకపోతే, ఇప్పుడు బాగానే ఉన్నా.. మరికొన్ని రోజుల్లో మరో ముప్పు ముంచుకొస్తుంది. దాన్ని థర్డ్ వేవ్ అనాలా, లేక సెకండ్ వేవ్ కొనసాగింపు అనాలా అనే విషయాన్ని పక్కనపెడితే నిర్లక్ష్యానికి చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం. దానికి విరుగుడు కేవలం వ్యాక్సిన్ మాత్రమేనంటున్నారు అధికారులు. వ్యాక్సినేషన్ ని సకాలంలో పూర్తి చేసేందుకు ఇంటింటికీ వ్యాక్సిన్ అనే కొత్త విధానం తెరపైకి తెస్తామని చెబుతున్నారు.