ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు అధికార వైసీపీపై ధీటుగా టీడీపీ నేతలు పోరాడుతున్నారు...నిదానంగా టీడీపీ పికప్ అవుతుందనుకునే సమయంలో, ఆ పార్టీకి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ రూపంలో భారీ షాక్ ఎదురైంది. టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒక్కరిగా ఉన్న బుచ్చయ్య, పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలిసింది. పార్టీ అధినాయకత్వం సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని, తాను ఫోన్ చేసినా...చంద్రబాబు, లోకేష్‌లు స్పందించడం లేదని బుచ్చయ్య అలకపాన్పు ఎక్కారు. ఇదే క్రమంలోనే టీడీపీకి రాజీనామా చేయాలని బుచ్చయ్య సిద్ధమయ్యారు.