ఇటీవల ఏపీ రాజకీయాల్లో మంత్రివర్గంలో మార్పులకు సంబంధించి అనేక కథనాలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని జగన్ మొదట్లో చెప్పగా, ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది...అంటే ఈ ఏడాది ఆఖరికి జగన్ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది. మొదట్లో చెప్పిన దాని ప్రకారం...పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి, కొత్తవారికి అవకాశం ఇవ్వొచ్చని తెలిసింది. అయితే 50 శాతం వరకు మంత్రులని పక్కనబెట్టొచ్చని మరో ప్రచారం కూడా వస్తుంది. అసలు సగం కాదు, పనితీరు కాదు...మొత్తం మంత్రులని జగన్ పక్కనబెట్టేసి, మళ్ళీ ఫుల్గా కొత్తవారితో మంత్రివర్గాన్ని భర్తీ చేయనున్నారని కథనాలు వస్తున్నాయి.