టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీలు వేరైనా బాబు అంటే రేవంత్‌కు గౌరవం ఉందని పలు సందర్భాల్లో అర్ధమైంది. అయితే అదే చంద్రబాబు ద్వారా రేవంత్‌ని, ప్రత్యర్ధి పార్టీలు టార్గెట్ చేసి విమర్శలు చేశాయి. రేవంత్ ఇప్పటికీ చంద్రబాబు మనిషే అని, పీసీసీ రావడానికి చంద్రబాబే కారణమని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు.