ఏపీ ప్రజల్లో మార్పు వచ్చిందో...లేక మీడియా చేసే ప్రచారమో తెలియదు గానీ, భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సీఎం జగన్ మీద..ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని ప్రచారం జరుగుతుంది. పైగా దీనికి సంబంధించి పలు సర్వేలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఆత్మసాక్షి గ్రూప్ పేరుతో ఒక సర్వే బాగా హల్చల్ చేస్తుంది. ఈ సర్వేలో వైసీపీకే అధికారం దక్కుతుందని తేలింది గానీ, మునుపటిలాగా వైసీపీకి సీట్లు రావని, టీడీపీ పుంజుకుందని తేల్చి చెప్పింది.